: కేసీఆర్ ను ‘షోలే'లోని గబ్బర్ సింగ్ తో పోల్చిన రేవంత్!


తెలంగాణ సీఎంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాటి సూపర్ డూపర్ హిట్ చిత్రం 'షోలే'లోని గబ్బర్ సింగ్ పాత్రలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలను చర్చకు రానీయలేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, రెండు పార్టీల నేతలు ఒకరినొకరు పరస్పరం పొగుడుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా, తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

 

  • Loading...

More Telugu News