: తెలంగాణలో మరో ఖరీదైన పెళ్లి?.. శుభలేఖ నుంచే ఉట్టిపడుతున్న భారీతనం!


కొన్ని నెలల క్రితం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంతో, ఖరీదైన వివాహాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో మరో ఖరీదైన పెళ్లి జరగనుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రస్తుత ఎమ్మెల్సీ రాములు నాయక్ తన మూడో కుమారుడైన జితేంద్ర నాయక్ కు త్వరలో వివాహం చేయనున్నారు. అతిథులందరికీ పెళ్లి శుభలేఖతోనే ఆనాటి పెళ్లికి వేసుకురావాల్సిన దుస్తులు కూడా అందిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి కొలతలను రాములు నాయక్ ముందుగానే తీసుకున్నారట. పింక్ పైజామా, రెడ్ బాటమ్ పాటు లాల్చీని గిఫ్ట్ గా ఇస్తున్నారు. దుస్తులతో పాటు ఓ వెండి కడియం కూడా ఆహ్వానపత్రికలోనే ఉండటం గమనార్హం. ఇక పెళ్లి ఏ రేంజిలో చేస్తారో చూడాలని అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News