: యోగికి కీలక బాధ్యతలు.. మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలు?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ బీజేపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. పార్టీకి మోదీ తర్వాత అంతటి స్థాయి స్టార్ క్యాంపెయినర్ గా ఆవిర్భిస్తున్నారు. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనందున... ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతోంది. 150 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే పలు సంచనల నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ సేవలను గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేస్తారని ఆ పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.