: మరో ప్రత్యేకతను చాటుకున్న దుబాయ్!


ఎత్తైన కట్టడాలు, ప్రత్యేకమైన నిర్మాణాలకు మారుపేరైన దుబాయ్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంది. గంటకు 407 కిలోమీటర్ల వేగంతో వెళ్లే  పోలీసు కారును దుబాయ్ లో ప్రస్తుతం వినియోగిస్తున్నారు. దీంతో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే పోలీసు కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో ఇది స్థానం సంపాదించుకుంది. 2016 ఏప్రిల్ లో బుగట్టి వెయ్రోన్ కారును దుబాయ్ పోలీసులు కొనుగోలు చేశారు.

ఈ కారు ప్రపంచంలోనే రెండో స్ట్రీట్-లీగల్ కారుగా ‘గిన్నిస్’కు ఎక్కింది. సుమారు రూ.10.5 కోట్లు ఖరీదు చేసే ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే .. 16 సిలిండర్ ఇంజన్ 1000 హార్స్ పవర్ కలిగి ఉంది. దుబాయ్ పోలీస్ సర్వీస్ లో ఉన్న14 సూపర్ ఫాస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. కాగా, మరో సూపర్ ఫాస్ట్ కారు హెన్నెస్సీ వెనోమ్ జీటీ గంటకు 472 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు మాట్లాడుతూ, మరింత సమర్థవంతంగా పని చేసేందుకు ఈ కార్లు ఉపయోగపడతాయిని చెప్పారు.

  • Loading...

More Telugu News