: ప్రియురాలి పుట్టినరోజు కోసం కరీబియన్ దీవులకు వెళ్లిన టైటానిక్ హీరో


తన ప్రియురాలు నైనా అగ్దాల్ కోసం హాలీవుడ్ సూపర్ స్టార్, టైటానికి హీరో లియొనార్డో డికాప్రియో కరీబియన్ దీవులకు వెళ్లాడు. 25వ పడిలోకి అడుగుపెట్టిన నైనా బర్త్ డే వేడుకలను అక్కడే జరిపాడు. ఆమె పుట్టిన రోజు కోసం తన స్నేహితులతో కలసి ఓ ప్రత్యేక విమానంలో లియొనార్డో అక్కడకు వెళ్లాడు. ఏంజెలీనాతో విడిపోయిన తర్వాత గత ఏడాది జూన్ నుంచి నైనాతో లియొనార్డో డేటింగ్ చేస్తున్నాడు. లియొనార్డో 42వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవలే ఫ్రాన్స్ లోని ఓ దీవిలో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా వీరిద్దరూ కలసి దీవిలో గల ఓ రిసార్ట్ లో విడిది చేశారు. 

  • Loading...

More Telugu News