: నెహ్రూ కుటుంబంలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి వ్యక్తి!: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ప్రశంసలు


ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ రోజు మ‌రోసారి ఆ అంశంపై మాట్లాడుతూ... ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, తాము అంత్యక్రియలు చేయనున్నామని అన్నారు. మ‌రోవైపు మధ్యవర్తిత్వం ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమవుతుంద‌ని పేర్కొన్నారు.

నెహ్రూ కుటుంబంలో మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి వ్య‌క్తని, ఆయ‌న‌ హిందువులను జాగృత పరచడానికి ఎంతో పాటుప‌డ్డార‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. ఆ నాడు కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్ లో ప్రసారం చేయడానికి ఆయ‌న ఒప్పుకున్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News