: రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయాలి.. లేదంటే ఉద్యోగం వదులుకోవాలి: యూపీ సీఎం వార్నింగ్


ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి తాజాగా మ‌రికొన్ని ఆదేశాలు జారీ చేశారు. త‌మ‌ రాష్ట్రంలోని ప్రభుత్వాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, లేదంటే త‌మ‌ ఉద్యోగం వదులుకోవాలని అన్నారు. తాను ప‌ని మాంత్రికుడిన‌ని, త‌న‌కు ప‌ని త‌ప్ప వేరే ధ్యాసే లేద‌ని చెప్పారు. త‌న రాష్ట్రంలోని అధికారులంతా కూడా అలాగే ఉండాల‌ని అన్నారు. లేదంటే వారు ఉద్యోగాలు వ‌ది‌లేసేయాల‌ని, అందుకు త‌న‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తాను ఎలాంటి పొరపాట్లను సహించబోనని హెచ్చ‌రించారు. అధికారులు అధికారం ఉంది కదా అని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించ‌బోన‌ని అన్నారు.

  • Loading...

More Telugu News