: ప్రభుత్వ మైకుల్లో బూతు పురాణం.. ఉలిక్కిపడ్డ టర్కీ ప్రజలు!


అది టర్కీలోని కూజీకెంట్ పట్టణం. ప్రజలకు ఏదైనా సమాచారాన్ని చెప్పాల్సి వస్తే, సులువుగా ఉండేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు స్పీకర్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల అర్ధరాత్రి ఈ మైకుల్లో ఓ బూతు చిత్రం వినిపించింది. పట్టణంలోని స్పీకర్లను హ్యాక్ చేసిన కొందరు ఈ పనికి పాల్పడి వుంటారని అనుమానిస్తూ, మేయర్ తహసీన్ బబాస్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ వర్గాలు దీని వెనుక లేవని స్పష్టం చేసిన ఆయన, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని ప్రకటించారు. కాగా, మైకుల్లో వస్తున్న బూతు పురాణాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో ఉంచగా, ఇప్పుడది వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News