: లీడ్ లోకి రాగానే చాప చుట్టేసిన టీమిండియా... ఒకరి వెంట ఒకరు అవుట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో చేసిన స్కోరును అలా దాటామో లేదో... ఇలా ఒక్కొక్కరూ పెవీలియన్ దారి పట్టారు. జట్టు స్కోరు 300 పరుగులు దాటగానే, 317 పరుగుల వద్ద జడేజా, 318 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహాలు అవుట్ అయ్యారు. జడేజా, సాహాలను కుమిన్స్ అవుట్ చేయగా, భువనేశ్వర్ ను ఓకీఫీ బుట్టలో పడేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 115 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు కాగా, లీడ్ 25 పరుగులుగా ఉంది. ప్రస్తుతం ఉమేష్ యాదవ్, కుల్ దీప్ లు ఆడుతున్నారు.