: ఐఎస్ఐఎస్ పై పెను దెబ్బ... ఎయిర్ పోర్టును కైవసం చేసుకున్న సైన్యం


అమెరికా సైన్యం అండగా సిరియా దళాలు ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న కీలకమైన విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నాయి. యూఎస్, కుర్దులు, అరబ్ దళాల సాయంతో ముందడుగు వేసిన సిరియా డెమోక్రటిక్ దళాలు, దేశంలోని అతిపెద్ద డ్యామ్ గా, ఎప్పుడైనా కూలిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్న తబ్కా ఆనకట్టకు సమీపంలోని ఎయిర్ బేస్ ను చుట్టుముట్టి పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టారని ఎస్డీఎఫ్ ప్రతినిధి తలాల్ సిలో వెల్లడించారు. ఆ ప్రాంతంలో మిగిలివున్న కొద్ది మంది ఉగ్రవాదులూ పారిపోయారని అన్నారు. కాగా, ఇప్పటికే రక్కా వంటి కీలక నగరాలపై పట్టు కోల్పోయిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు సిరియాలో అతికొద్ది ప్రాంతానికే పరిమితమై ఉండగా, వారిని పూర్తిగా తరిమివేసేందుకు సైనిక దళాలు ముందుకు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News