: కేశినేని నాని, బొండా ఉమాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ... అసెంబ్లీ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష


ఏపీ అసెంబ్లీ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీక్షకు దిగారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా... నల్లరంగు దుస్తులు ధరించి ఆయన దీక్ష చేపట్టారు. రవాణాశాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

తిరుపతి విమానాశ్రయంలో జరిగిన ఓ చిన్న ఘటన నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డి సహా తనపైన తప్పుడు కేసు పెట్టి 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఓ బహిరంగ లేఖను రాశారు. నెల్లూరు జైల్లో ఉండగానే, మరికొన్ని కేసులు బనాయించి పీలేరు, రాజమండ్రికి తరలించారని విమర్శించారు. ఐజీ స్థాయి అధికారిపై టీడీపీ నేతలు దుర్భాషలాడినా కేసులు నమోదు చేయలేదని మండిపడ్డారు. మధ్యవర్తిత్వం పేరుతో నాటకాలాడి కేసు నమోదు కాకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో తాలిబన్ల తరహా పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News