: చిన్నగొడవకు పెద్దశిక్ష.. జగిత్యాల పోలీసుల కాఠిన్యం.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్


తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ఆదివారం ఓ పార్టీ సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని తీన్‌ఖని ప్రాంతానికి చెందిన ముహమ్మద్ సల్మాన్‌ఖాన్ అనే యువకుడు తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరాడు. దీనికి పార్టీకి చెందిన ఓ నాయకుడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో సల్మాన్‌పై నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి పెద్దమొద్దుకు కట్టేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష ఏంటంటూ పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో మూడు గంటల తర్వాత సల్మాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ లేకున్నా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పోలీస్ స్టేషన్ నుంచి కొందరు పారిపోవడం వల్లే  సల్మాన్‌ను పోలీసులు మొద్దుకు కట్టారని, అయితే ఆ విషయం తనకు తెలియదని జగిత్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు.  తెలిశాక అతడిని విడిపించానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News