: బాలికపై సామూహిక అత్యాచారం.. ఫేస్‌బుక్‌లో లైవ్.. అమెరికాలో ఘోరం
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను కొందరు పాడుపనులకు వాడుకుంటున్నారు. తమ అకృత్యాలను స్నేహితులకు చూపించే వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అమెరికాలోని షికాగోలో ఈనెల 19న జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఓ బాలిక (15)పై ఐదుగురు దుండగులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక దానిని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఫేస్‌బుక్‌లో ఈ ఘటనను 40 మంది చూసినా ఏ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈనెల 19న బాలిక అదృశ్యమైంది. 20న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21న బాలిక ఆచూకీ కనుగొన్నారు. బాలిక తప్పిపోయిన మరుసటి రోజే ఆమెపై నిందితులు ఐదుగురు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.