: సినిమాలో చాలా విశేషాలున్నాయి.. చూడండి!: ప్రభాస్


'థాంక్స్ డార్లింగ్స్' అంటూ ప్రభాస్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అభిమానుల కోసం ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని అన్నాడు. చాలా ఆలస్యమైంది, జాగ్రత్తగా వెళ్లండి అని అభిమానులకు సూచించాడు. సినిమాలో చాలా అంశాలు ఉన్నాయని, వాటిని చూసి ఆనందించండి అని అన్నాడు. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు రెండు డైలాగులు చెప్పాడు. 'నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా' అంటూ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. 'వాడు తప్పు చేశాడు, వాడి తలతెగింది' అంటూ మరో డైలాగును కూయడ చెప్పడంతో వేదిక ప్రభాస్ నినాదాలతో మార్మోగి పోయింది.

  • Loading...

More Telugu News