: ఎప్పటికీ నా ఫేవరేట్ కోస్టార్ ప్రభాసే: రానా
కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే, బాహుబలి కలకలం నిలిచిపోయే చిత్రమని రెండేళ్ల కిందట తాను చెప్పానని రానా గుర్తు చేశాడు. తన మాటను నిజం చేసిన అభిమానులకు ధన్యవాదాలని అన్నాడు. ఐదేళ్లపాటు ఈ సినిమాకు పని చేశానని, ఇందులో పని చేసిన ప్రతిక్షణం తనకు తీపి గురుతేనని అన్నాడు. తాను జీవితంలో ఎంత మందితో పని చేసినా ప్రభాస్ తన ఫేవరేట్ కో స్టార్ అని చెబుతానని అన్నాడు.
ఇకపై మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్లలేనంటే బాధగా ఉంటుందని చెప్పాడు. వల్లి (కీరవాణి భార్య) గారితో తిట్లు తినకపోతే జీవితంలో ఏదో లోటు ఉంటుందని రానా చెప్పాడు. 'వల్లి గారూ, వారానికోసారి తిట్టండి... మీకు నేను ఆ అవకాశాలు ఇస్తాను' అని రానా చెప్పాడు. తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలన్నాడు రానా.