: ఏమయ్యా ప్రభాస్, ఇలా అయితే ఎలా?: కీరవాణి


ప్రభాస్ కి స్టార్ హీరోలా బిల్డప్ ఇవ్వడం చేతకాదు... కొందరు హీరోల్లా గర్వంగా ఉండడం చేతకాదు... భేషజాల్లేవు.. అలాంటివాడు ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడని ప్రముఖ దర్శకుడు కీరవాణి ప్రశ్నించారు. 'ఏమయ్యా ప్రభాస్, ఇలా అయితే ఎలా?' అని ఆయన అడిగారు. చాలా మంది హీరోల్లో ఉండే అలాంటి లక్షణాలు లేకపోయినా ప్రభాస్ లో గొప్ప మనసు ఉందని అన్నారు. ప్రభాస్ నిరాడంబరుడైన మనిషని ఆయన కితాబునిచ్చారు. ఎలాంటి భేషజాలు లేని వాడని, చాలా మంది హీరోలకు చేతనైన ఆ లక్షణాలు ప్రభాస్ లో మచ్చుకైనా కానరావని, ఆయనకు చేతకాదని ఆయన చెప్పారు. అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News