: ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఇచ్చింది!: రమ్యకృష్ణ
ఒక సినీ దర్శకుడు ఐదేళ్ల పాటు ఒకే సినిమాపై పని చేయాలంటే ఎంత కష్టమో తనకు తెలుసని ప్రముఖ నటి రమ్యకృష్ణ తెలిపింది. బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆమె మాట్లాడుతూ, తన ఇన్నేళ్ల కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకమైనదని చెప్పింది. ఈ సినిమా ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఇచ్చిందని తెలిపింది. ఈ సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని, ఇలాంటి సినిమాలు పదేపదే రావని చెప్పింది. ఇలాంటి సినిమాలో నటించడం ఒక జీవితకాలపు అనుభవమని చెప్పింది. ఈ సినిమాలో పని చేసినవారందికీ ఓ పెద్ద కేకతో అభినందించాలని ఆడియన్స్ ను కోరింది. దీంతో వేదిక దద్దరిల్లేలా అభిమానులు కేరింతలు కొట్టారు. శివగామి పాత్ర తనకు ప్రత్యేకమైనదని రమ్యకృష్ణ తెలిపింది.