: మహిళ కడుపులో పెరిగిన పుట్టగొడుగులు!


ఓ మహిళ కడుపులో పుట్టగొడుగులు పెరిగిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని ఓ 50 ఏళ్ల మహిళ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ నొప్పి తీవ్రం కావడంతో ఆమె చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు స్కాన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె కడుపులో పుట్టగొడుగులు కనిపించాయి. దీంతో ఆమె ఆహారం తీసుకునే ముందు శుభ్రం చేయకుండా తిని ఉంటుందని, అందుకే పుట్టగొడుగులు కడుపులో పెరిగాయని వారు చెప్పారు.

ఇక, ఈ పుట్టగొడుగులు కొన్ని చోట్ల 7 సెంటీమీటర్ల వరకు పెరగడంతో ఆమెకు కడుపునొప్పి తీవ్రమైందని వారు చెప్పారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో పాటు, ఆహారాన్ని బాగా నమిలి మింగితే ఇలాంటి బాధలు తప్పుతాయని వారు చెప్పారు. దీంతో ఆమెకు సర్జరీ చేసి, వాటిని తొలగించారు.  

  • Loading...

More Telugu News