: కమలహాసన్ పై 'బసవేశ్వర మఠం' ప్రణవానంద స్వామి కేసు
ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ పై కర్ణాటక రాజధాని బెంగళూరులో కేసు నమోదైంది. మహాభారతంపై కమల హాసన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బసవేశ్వర మఠంకు చెందిన ప్రణవానంద స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమధ్య ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కమల హాసన్ మాట్లాడుతూ, ‘పురుషుల జూదంలో పాంచాలిని ఓ పావులా వాడుకున్నారని భారతం చెబుతోంది’ అన్నారు.
దీనిపై తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రణవానంద స్వామి బెంగుళూరులో కేసు నమోదు చేయించారు. కాగా, కమల్ ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే తిరునల్వేలి జిల్లా కోర్టులో హిందూ మక్కల్ కచ్చి సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు చెన్నై సిటీ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు.