: విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి...లేదా పెన్ డౌన్: ఉద్యోగ సంఘాల జేఏసీ


కేశినేని ట్రావెల్స్ అధినేతగా ఉన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ ఆర్టీఏ అధికారులపై దాడికి దిగడాన్ని ఖండిస్తున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ తెలిపింది. నిన్న చోటుచేసుకున్న సంఘటనలు రాజకీయ అధికార దుర్వినియోగాన్ని, ట్రావెల్ మాఫియా తీరుతెన్నులను రాష్ట్ర ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించాయని వారు ఆరోపించారు. నిన్న జరిగిన ఘటనపై ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపీ కేశినేనిపై చర్యలు తీసుకోని పక్షంలో పెన్ డౌన్ కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తాము ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? లేవా? ఉద్యోగులు ప్రశాంతంగా విధులకు హాజరుకావాలా? వద్దా? అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యోగులంతా ఏకమై ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచిస్తామని వారు చెప్పారు. పెన్ డౌన్ కు తాము సిద్ధమని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News