: మాజీ ప్రియుడి చెంత చేరిన దీపిక?
బాలీవుడ్ తారలు రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొనే తమ కెరీర్ తొలినాళ్లలో గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి బంధం పెళ్లిపీటలకు వెళ్తుందని భావించగా, ఏడాది తరువాత బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత రణ్ బీర్.. కత్రినాతో ప్రేమలో పడగా, దీపిక.. రణ్ వీర్ సింగ్ ప్రేమలో మునిగి తేలింది. వీరి ప్రేమలు సుదీర్ఘ కాలం నడిచాయి. వీరు కూడా పెళ్లి పీటలెక్కుతారని భావించారు. అయితే దీపికా పదుకొనే హాలీవుడ్ లో అరంగేట్రం చేసిన తరువాత విన్ డీజిల్ తో అనుబంధం పెంచుకుంది. దీంతో రణ్ వీర్ తో ఆమెకు గ్యాప్ పెరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా హోలీ పండుగ రోజున రణ్ బీర్ కపూర్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, రణవీర్ తో తన బ్రేకప్ విషయాన్ని చెప్పకనే చెప్పింది దీపిక. అంతకుముందే రణ్ బీర్, కత్రినా జంట కూడా విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా దీపికా పదుకొనే, రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ సింగ్ ఓ కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో మాజీ ప్రేమికులు మళ్లీ కలిసిపోయారా? దీపిక.. రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకోనుందా? అంటూ వార్తలు వెలువడుతున్నాయి.