: యువతీ యువకులను ఇబ్బందులు పెట్టొద్దు: యూపీ పోలీసులకు సూచన
యూపీలో కొత్తగా తీసుకువచ్చిన యాంటీ రోమియో స్క్వాడ్, ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్న విమర్శలు పెరుగుతున్న వేళ, అమాయక ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టవద్దని పోలీసులకు బీజీపీ సూచించింది. యువతీ యువకులు జంటగా ఉన్నా, కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నా, వారిని ప్రశ్నించవద్దని పోలీసులకు స్పష్టం చేసినట్టు బీజేపీ నేత ఎస్ ప్రకాష్ తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం ఒంటరి ఆడవాళ్లకు వేధింపులు కలుగకుండా చూసేందుకేనని, అనవసరంగా యువకులను లక్ష్యం చేసుకోవద్దని ఆయన అన్నారు. ఇక ఈ స్క్వాడ్ పై వస్తున్న విమర్శలపై స్పందించిన సీఎం, ఈవ్ టీజర్లపై చర్యలకే ఈ విభాగాన్ని ప్రారంభించామని, అమ్మాయిలు, అబ్బాయిలు కలసి నడుస్తున్నా, వారు కూర్చుని మాట్లాడుకుంటున్నా వారిని కదిలించవద్దని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు.