: వేగం పెంచిన టీమిండియా... రాహుల్ హాఫ్ సెంచరీ
మధ్యాహ్న లంచ్ విరామం తరువాత టీమిండియా ఆటగాళ్లు స్కోరు వేగాన్ని పెంచారు. తొలి సెషన్ తో పోలిస్తే, ఎండ పెరిగిన తరువాత బంతి స్వింగ్ అవడం తగ్గినట్టు స్పష్టమవడంతో, లోకేష్ రాహుల్, పుజారాలు బౌండరీలతో విజృంభించారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 102 బంతులాడిన రాహుల్ 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 51 పరుగులు చేయగా, మరో ఎండ్ లో ఉన్న పుజారా 66 బంతుల్లో రెండు ఫోర్లతో 23 పరుగులతో ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం భారత స్కోరు 34 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 211 పరుగుల వెనుకంజలో ఉంది.