: నత్తనడకన భారత బ్యాటింగ్... 28 ఓవర్లకు 64 పరుగులే!
ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్ నత్తనడకన సాగుతోంది. ఆటగాళ్లు రక్షణాత్మక ధోరణితో ఆచితూచి ఆడుతుండగా, మధ్యాహ్న భోజన విరామ సమయానికి 28 ఓవర్లలో 64 పరుగులను మాత్రమే చేశారు. 11 పరుగులు చేసిన మురళీ విజయ్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన పుజారా కూడా నిదానంగా ఆడుతున్నాడు. 75 బంతులాడిన లోకేష్ రాహుల్ 31 పరుగులు, 57 బంతులాడిన పుజారా 22 పరుగులు చేశారు. అంతకుముందు తన తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.