: భయం కలిగించే ఎన్టీఆర్ కొత్త లుక్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇది!


బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్ భయం కలిగించేలా ఉంది. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తుండగా, నెగటివ్ రోల్ కు సంబంధించిన మేకప్ చిత్రాలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' చిత్రానికి పని చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ గార్ట్ వెల్, హైదరాబాద్ వచ్చి, స్వయంగా ఎన్టీఆర్ లుక్స్ ను డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. కంటి స్థానంలో పలుచని సిలికాన్ మాస్క్ లను వాడుతూ ఆయన వేసిన మేకప్ ఫైనల్ అయింది. ఈ పాత్ర కోసం ఆయన మాస్క్ లు కూడా తయారు చేయగా, వాటి చిత్రాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News