: కిటకిటలాడుతున్న తిరుమల... ఎండతో భక్తుల అవస్థలు


దేవదేవుని దివ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ భక్తులతో నిండిపోగా, క్యూలైన్ వెలుపలకు వచ్చేసింది. నారాయణగిరి ఉద్యానవనం దాటి, సుమారు కిలోమీటరు వరకూ భక్తులు కంపార్టుమెంట్లలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేచివున్న భక్తులను సాధ్యమైనంత త్వరగా క్యూ లైన్లలోకి పంపిస్తామని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్న పానీయాలను సమకూర్చుతున్నామని పేర్కొన్నారు. కాగా, తిరుమలలో ఎండ వేడి అధికంగా ఉండటం కూడా భక్తులను ఇబ్బందులు పెడుతోంది. మాఢవీధుల్లో నడవలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఈ ఇబ్బందులను నివారించేందుకు ఉదయం 9 గంటల్లోపే కార్పెట్లు పరిచి, వాటిని నీటితో తడుపుతున్నామని అధికారులు తెలియజేశారు.

  • Loading...

More Telugu News