: తమిళ హీరో అజిత్‌పై కాజల్ ప్రశంసల జల్లు


తమిళ హీరో అజిత్‌తో కలిసి కథానాయిక కాజల్ ‘వివేగం’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజిత్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. ఆయ‌న‌తో కలిసి నటించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా కథ చాలా బాగుంటుందని, అజిత్‌ అద్భుతమైన వ్యక్తని వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో తాను పేద మహిళ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇక‌ బల్గేరియాలో జరుగుతున్న షెడ్యుల్‌తో త‌న‌ పాత్రకు సంబంధించిన షూటింగ్  పూర్తవుతుందని తెలిపింది. అలాగే, ఇటీవ‌ల తాను చిరంజీవితో క‌లిసి ‘ఖైదీ నంబర్‌ 150’లో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని చెప్పింది.

  • Loading...

More Telugu News