: మద్యం దుకాణాలు మూసేయాలంటూ వారణాసిలో ఆందోళన బాటపట్టిన మహిళలు
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కబేళాలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, సమాజంలో ఎన్నో ఇబ్బందులకు కారణమవుతున్న మద్యం దుకాణాలను కూడా మూసేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజక వర్గమైన వారణాసిలో మహిళలు ఆందోళన చేపట్టారు. మద్యం వల్ల తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న వారు... ఈ రోజు వారణాసిలోని రోడ్లను దిగ్బంధించి, పలు మద్యం దుకాణాలను మూయించారు. మద్యం దుకాణాలను పూర్తిగా మూయించే వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు.