: కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలంటూ లాలూకు సూచించిన వైద్యులు


ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం పాట్నాలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా స్టేజీపైకి ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో... అది కుప్పకూలింది. ఈ క్రమంలో గాయపడ్డ లాలూను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా లాలూకు వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని... అయితే, వెన్ను నొప్పితో బాధపడుతున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News