: రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్!
ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా అంటూ ఇతర టెలికం సంస్థలకు దడ పుట్టించిన రిలయన్స్ జియో వచ్చేనెల నుంచి తమ ప్లాన్స్‌ను అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ తమ కస్టమర్ల ముందు మరో భారీ ఆఫర్‌ను ఉంచింది. తమ ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకొని తాము అందించే ప్లాన్‌లలో భారీగా లాభం పొందవచ్చని తెలిపిన జియో... ఇప్పటికే అందుకోసం రీఛార్జ్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 కన్నా ముందే తాము అందిస్తోన్న ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటే 10జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.
ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి కోసం రూ.149 పథకం కింద 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్, అంతేగాక అదనంగా 1జీబీ డేటాను అందిస్తోంది. ఇక రూ.303 ప్లాన్‌లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5జీబీ డేటాను అందిస్తోంది. మరోవైపు రూ.499 రీఛార్జ్‌తో నెలవారీ పథకం కింద మరో ఆఫర్‌ను ఉంచింది. ఇప్పటికే రిలయన్స్ జియో ప్రైమ్ సభ్యత్వాన్ని ఆ యూజర్లలో 84 శాతం మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.