: అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలి: ఎల్.రమణ


హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అన్ని జిల్లాల‌ అధ్యక్షులతోపాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో త‌మ పార్టీని మరింత బ‌ల‌ప‌రిచే దిశ‌గా ముందుకు వెళ్లాల‌ని ఎల్‌.ర‌మ‌ణ త‌మ‌ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి త‌మ‌పార్టీ తెలంగాణ విభాగాన్ని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల‌ని, అందుకోసం గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భ‌విష్య‌త్తులో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News