: 27 టౌన్ షిప్ లు, 9 సిటీలు, 2 ఐకానిక్ బిల్డింగ్ లు వస్తున్నాయి: చంద్రబాబు
విజయవాడ, కృష్ణా జిల్లా అభివృద్ధి కాకపోవడానికి అసలు కారణం భూములు లేకపోవడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వివిధ పనుల కోసం భూములిచ్చిన రైతులకు చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి 27 టౌన్ షిప్ లు, 9 సిటీలు, 2 ఐకానిక్ బిల్డింగ్ లు వస్తున్నాయని చెప్పారు. ఈ ఉగాదికి ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. మన రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఇవి రెండూ మనకు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. మెరుగైన పాలన కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారం ఎంతో అవసరమని చెప్పారు.