: కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి 2 లక్షల చోరీ


ఏకంగా ఓ ఎమ్మెల్యే అకౌంట్ నుంచే డబ్బును దోచేశారు చోరశిఖామణులు. కర్ణాటకలోని చన్నపట్న నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ అకౌంట్ నుంచి రూ. 1.9 లక్షలను ఎవరో కొట్టేశారు. ఈ మేరకు ఆయన బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  మార్చి 18న ఈ చోరీ జరిగినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబై, పూణే నుంచి క్యాష్ ను విత్ డ్రా చేశారని తెలిపారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News