: బాగా మాట్లాడారు... కీపిట్ అప్!: వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రశంసలు


వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వ్యూహం బాగుందని మెచ్చుకున్నారు. వైసీపీనీ పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశామని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తోందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు.

న్యాయ విచారణ జరిపిస్తామంటే ప్రతిపక్ష నేత జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పై తీర్మానం సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి చాలా బాగా ప్రసంగించారని మెచ్చుకున్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ, ఎస్వీ మోహన్ రెడ్డిలు కూడా బాగా మాట్లాడారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యూహాలతోనే ముందుకు వెళ్లాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.

  • Loading...

More Telugu News