: నిర్మాత సంజయ్ నన్ను లైంగికంగా వేధించాడు: నటి శిల్పాషిండే


దాసరి నారాయణరావు సినిమా 'చిన్నా', సురేష్ వర్మ చిత్రం 'శివాని'లలో నటించిన ముంబై భామ శిల్పా షిండే లైంగిక వేధింపులకు గురైంది. 'బాబాజీ ఘర్ పర్ హై' టీవీ షోతో బాగా పాప్యులర్ అయిన శిల్పా... ఆ షో నిర్మాత సంజయ్ కోహ్లీపై ముంబైకి సమీపంలోని వాల్వీ నైగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సంజయ్ తనతో తరచుగా అసభ్యంగా ప్రవర్తించే వాడని, తనను ఒక్కసారి అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

దీనికి తాను నిరాకరించగా, ఈ విషయం బయటకు చెబితే షో నుంచి తీసేస్తానని బెదిరించాడని చెప్పింది. ఆ తర్వాతి రోజు మేకప్ రూమ్ లోకి వచ్చి, శారీరక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడని, ఈ మాటలను మేకప్ మ్యాన్ వినడంతో అతన్ని విధుల నుంచి తొలగించాడని ఆరోపించింది. దీంతో, ఆ షో నుంచి తాను తప్పుకున్నానని... ఈ నేపథ్యంలో, తనకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ క్రమంలో, సంజయ్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. మరోవైపు, తన పరువుకు నష్టం వాటిల్లేలా శిల్పా ప్రవర్తించిందంటూ ఆమెపై రూ. 12.5 కోట్ల పరువు నష్టం దావాను కోహ్లీ వేశాడు. శిల్పా కేసు బూటకమని, తనపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News