: పాతబస్తీ తుపాకుల కేసులో పురోగతి.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే వాస్తవాలు
హైదరాబాద్ పాతబస్తీ తుపాకుల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు యువకుల నుంచి అత్యాధునికమైన 6 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు విదేశాలకు చెందినవిగా సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు గుర్తించారు. నిందితుడు ఫాహజ్ తండ్రి కదలికలపై పోలీసులను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. అమెరికా వెళ్లేందుకు కూడా ఫాహజ్ తండ్రి యత్నించగా... అతనికి అమెరికా అధికారులు వీసాను నిరాకరించారు. విదేశాల నుంచి ఈ ఆయుధాలను ఎలా తెచ్చారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.