: ఐపీఎల్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. నేటి నుంచి టికెట్ల విక్ర‌యం


హైద‌రాబాద్‌లో ఐపీఎల్ ప‌దో సీజ‌న్ సంద‌డి మొదలైంది. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ టికెట్ల‌ను నేటి నుంచి ప్రారంభించ‌నున్న‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ ప్ర‌క‌టించింది. జింఖానా మైదానంతోపాటు ఎంపిక చేసిన కేంద్రాల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయ‌ని  పేర్కొంది. అలాగే ఆన్‌లైన్‌లోనూ టికెట్ల‌ను విక్ర‌యానికి ఉంచిన‌ట్టు తెలిపింది. వ‌చ్చే నెల 5, 9, 17, 19, 30, మే 6, 8వ తేదీల్లో ఏడు మ్యాచ్‌లు ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. ఆన్‌లైన్‌లో www.sunrisershyderabad.in వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్న స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం ఏప్రిల్ 4న జ‌రిగే ఆరంభ వేడుక‌లు, మే 21 జ‌రిగే ఫైన‌ల్ టికెట్ల విష‌యంలో మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కాగా,  జింఖానా మైదానం, ఎల్బీ స్టేడియం, ఉప్పల్‌లోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శ‌నివారం ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు, అత్తాపూర్‌, గచ్చిబౌలి, మలక్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మదీనాగూడ, ఏఎస్‌ రావు నగర్‌, శివం రోడ్డులోని జస్ట్‌ బేక్‌ అవుట్‌లెట్లతో పాటు జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్‌లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించింది. ఇక కార్పొరేట్‌, బ‌ల్క్ బుకింగుల కోసం 8978781831 నంబ‌రులో సంప్ర‌దించాల‌ని కోరింది.

  • Loading...

More Telugu News