: వైర‌ల్ అయిన లంచగొండి ట్రాఫిక్ పోలీస్ వీడియో.. వేటేసిన అధికారులు


హెల్మెట్ లేని ద్విచ‌క్ర వాహ‌న‌దారుడి నుంచి లంచం వ‌సూలు చేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఆ వీడియోను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల‌లో ఇప్ప‌టికే ఐదు ల‌క్ష‌ల మంది వీక్షించారు. హైద‌రాబాద్‌లోని హిమాయ‌త్‌న‌గ‌ర్ వై జంక్ష‌న్ వ‌ద్ద విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ లేని  వాహ‌న‌దారుడిని ఆపి లంచం తీసుకున్నాడు. దీనిని గ‌మ‌నించిన న‌గ‌రానికే చెందిన శ్రీధ‌ర్ వేముల త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు.

అంతేకాకుండా హైద‌రాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌ పేజీకి  ట్యాగ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా గంట‌ల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది. 5 ల‌క్ష‌ల మంది దానిని వీక్షించ‌గా, ప‌దివేల మంది షేర్ చేయ‌డం విశేషం. ఈ వీడియో చూసి స్పందించిన  ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ జితేందర్ ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. లంచం తీసుకున్న వ్య‌క్తిని  ఎన్‌.సత్యవిష్ణుగా గుర్తించి సస్పెండ్ చేశారు. ద‌ర్యాప్తు అనంత‌రం చర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News