: రజనీకాంత్‌ శ్రీలంక పర్యటనపై.. తమిళనాడులో నిరసనలు


సౌతిండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌చ్చేనెల 10న శ్రీ‌లంకలోని జాఫ్నాలో ప‌ర్య‌టించి, తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన‌ ఇళ్ల త‌ాళాల‌ను ల‌బ్ధిదారుల‌కు అందించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయన పర్యటనపై విదుథలై చిరుథైగల్ కచ్చి (వీసీకే)తో పాటు మరుమర్లర్చి ద్రావిడ మున్నేత్ర కజగం (డీఎండీకే) గ్రూపులకు చెందిన తమిళ సంస్థలు మండిప‌డుతున్నాయి. ఆ ఇళ్ల‌ను లైకా గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్ కరన్‌ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటు చేసిన జ్ఞానం ఫౌండేషన్ నిర్మించింది.

2014లో లైకా గ్రూప్ నిర్మించిన 'కత్తి' చిత్రాన్ని శ్రీలంక తమిళ సంస్థలు నిషేధించాయి. తాజాగా లైకా నిర్మిస్తున్న రోబో 2.0లో రజనీ న‌టిస్తున్నారు. ఈ సినిమా అక్క‌డ విడుద‌ల చేసే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా ఆ ఇళ్ల‌ను అందిస్తున్నార‌ని ఆందోళ‌నకారులు ఆరోపిస్తున్నారు. సివిల్ వార్ కారణంగా శ్రీలంకలో నష్టపోయిన తమిళుల గురించి ఎప్పుడూ స్పందించ‌ని రజనీకాంత్ ఇప్పుడు వారికి ఇళ్లు పంచిపెట్టడం కోసం వెళ్లడం ఏంట‌ని ఆందోళ‌న‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News