: విమానాశ్రయ ఉద్యోగిపై దాడిచేసిన ఎంపీకి పూలు, చెప్పులతో నిరసన


ఎయిర్ ఇండియా ఉద్యోగితో దురుసుగా ప్ర‌వ‌ర్తించడమే కాకుండా ఆయ‌న‌పై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఎయిర్‌పోర్టులో ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఈ రోజు నిర‌స‌న తెలిపారు. ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను చెప్పుతో కొట్టిన గైక్వాడ్‌కు తామూ అదే పని చేస్తామని చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో మూడో టర్మినల్ ముందు ఆమ్ ఆద్మీ స‌భ్యులు పూలు, చెప్పులతో త‌మ‌ నిరసనను తెలియజేశారు.

మ‌రోవైపు ఎంపీ గైక్వాడ్‌ మహారాష్ట్రకు వెళ్లేందుకు ఈ రోజు సాయంత్రం 4:15 గంటలకు టికెట్ రిజర్వ్ చేసుకోగా ఎయిరిండియా ఈ టికెట్‌ను రద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎయిర్‌పోర్టుకి వస్తారన్న‌ సమాచారం అంద‌డంతో గొడవ జరుగుతుందని భావించిన అధికారులు విమానాశ్ర‌యం వ‌ద్ద‌ భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఎంపీ అక్క‌డ‌కు రాలేదు. ఎయిరిండియాతో పాటు ప‌లు విమానయాన సంస్థలు ఆయ‌న‌కు ప్రవేశాన్ని నిషేధించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News