: జగన్ వెళ్లిన తరువాత వీఆర్ఏ, పారామెడికల్ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ కూడలి వద్ద వీఆర్ఏలు, పారామెడికల్ సిబ్బంది ధర్నా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిసేపటి క్రితం ధర్నా ప్రాంగణానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ రోజు శాసనసభ నుంచి ధర్నా స్థలికి వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రసంగం చేసి వెళ్లిపోయారు. అనంతరం వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లడానికి వారు ప్రయత్నాలు జరుపుతున్నారన్న సమాచారంతోనే వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.