: పవన్ కల్యాణ్ ఓ పెద్ద మోసగాడు: బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ విమర్శకుడు, బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఓ ఫ్లాప్ హీరో అని అతను అన్నాడు. అంతేకాదు, 'అతను ఓ పెద్ద మోసగాడు కూడా' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని... డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను పవన్ కల్యాణ్ రూ. 8 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపించాడు. ఆంధ్రప్రదేశ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల రూ. 2 కోట్లు నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడంటూ... అతని ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. 'కాటమరాయుడు' సినిమాను హిందీలో విడుదల చేస్తామని చెప్పడాన్ని ఎద్దేవా చేశాడు.

  • Loading...

More Telugu News