: చిరంజీవి పిలవలేదు.. బాలకృష్ణ మాత్రం పిలిచాడు!: సత్యనారాయణ


సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్లకు గౌరవం దక్కడం లేదని కైకాల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేవారు. మరోవైపు చిరంజీవి 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. 'ఖైదీ నంబర్ 150' సినిమా చూశారా? అనే ప్రశ్నకు బదులుగా... చూడలేదని, చిరంజీవి తనను పిలవలేదని చెప్పారు. గోల, అరుపుల మధ్య థియేటర్ లో సినిమా చూడలేనని తెలిపారు. అయితే, 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూడ్డానికి రావాలంటూ బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి పిలిచాడని... అందుకే ఆ సినిమా చూడ్డానికి వెళ్లానని చెప్పారు. చెన్నైలో సినీపరిశ్రమలోని పెద్దల కోసం ఓ షో వేసేవారని... హైదరాబాదులో మాత్రం అలాంటి ఆనవాయతీ లేదని విమర్శించారు.  

  • Loading...

More Telugu News