: ‘బ్రిటన్ పార్లమెంటు ఎదుట దాడి’ ఘటనపై సెహ్వాగ్‌ ఆసక్తికర ట్వీట్!


బ్రిటన్ పార్లమెంటు ఎదుట ఓ దుండ‌గుడు దాడి చేసి క‌ల‌కలం రేపిన ఘటనపై టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్ట‌ర్ లో స్పందించాడు. ఆ కాల్పుల‌ ఘటనను వివరిస్తూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేయ‌డం విశేషం. ఇటువంటి దాడులు జరిగినప్పుడు సామాన్య ప్రజలు ఎలా స్పందిస్తారో ఆ ఫొటోలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు సెహ్వాగ్‌. ఆయ‌న పోస్ట్ చేసిన‌ ఫొటోలో ఉగ్రదాడి, ప్రార్థనలు, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫొటోగా జాతీయ జెండాను పెట్టడం వంటి అంశాలు, మళ్లీ జీవితం ఎప్ప‌టిలాగే మారడం వంటి సూక్తి ఉంది. ‘ప్రపంచం మొత్తంలో ఈ విధానం ఆగిపోవాలి’ అని ఆయ‌న పేర్కొన్నాడు.


  • Loading...

More Telugu News