: విదేశాల్లో వైద్య చికిత్స చేయించుకుని తిరిగొచ్చిన సోనియా!


వైద్య చికిత్స నిమిత్తం ఇటీవల విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి ఈ రోజు భారత్ చేరుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం సోనియా విదేశాలకు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత, ఆమెకు తోడుగా తనయుడు రాహుల్ గాంధీ వెళ్లడం తెలిసిందే. చెకప్ నిమిత్తం సోనియాను కారులో తీసుకువెళ్తున్న ఓ ఫొటోను రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, వైద్య చికిత్స నిమిత్తం ఏ దేశానికి ఆమె వెళ్లారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సోనియా గాంధీ అమెరికాకు వెళ్లినట్టు తెలిసింది.  

  • Loading...

More Telugu News