: గుండెపోటుతో ‘అగ్రి గోల్డ్’ బాధితుడి మృతి!
అనంతపురంలో ‘అగ్రిగోల్డ్’ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణానికి చెందిన షేక్ ఖాదిర్ బాషా అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులు తిరిగి తనకు వస్తాయో, రావో అనే దిగులుతో ఆయన ఈ రోజు గుండెపోటుకు గురై మరణించినట్టు ఆయన బంధువులు తెలిపారు. కాగా, తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని ‘అగ్రి గోల్డ్’ బాధితులు విజయవాడలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాము దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని, తమకు న్యాయం చేయాలంటూ లక్షలాది మంది ‘అగ్రిగోల్డ్’ బాధితులు ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకోవడం విదితమే.