: నాకు చెప్పడానికి నీవు ఎవడ్రా?: సీఐపై ఫైర్ అయిన వీహెచ్.. రాజీనామా చేస్తానంటున్న సీఐ


తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వెళుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావును సీఐ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో, సుధాకర్ పై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను ఆపడానికి నీవు ఎవడ్రా?' అంటూ సీఐను వీహెచ్ బండబూతులు తిట్టారు. తన పట్ల వీహెచ్ ప్రవర్తించిన తీరుకు సీఐ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఎస్సీ కులానికి చెందిన తనను వీహెచ్ కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని... అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. తన సొంత డిపార్ట్ మెంట్ లోనే తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News