: జగన్ ది పిరికితనమే... ఎవరో ఒకరే హౌస్ లో ఉండాలి... ఇద్దరూ ఉండటానికి వీల్లేదు: చంద్రబాబు
తప్పుడు ఆరోపణలు చేసిన వైకాపా నేత జగన్, ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారని, ఇది ఆయన పిరికితనానికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్, విచారణకు అంగీకరించాల్సిందేనని పట్టుబట్టిన ఆయన, మంత్రి ప్రత్తిపాటి తప్పుంటే, ఆయన్ను తక్షణం తొలగిస్తామని తేల్చి చెప్పారు. "సవాల్ ను స్వీకరించాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేయాలి. ఇద్దరిలో ఒకరే హౌస్ లో ఉండాలే తప్ప, ఇద్దరూ ఉండటానికి అవకాశం లేదు అధ్యక్షా. ఆ విషయం నేను చెబుతున్నాను" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుల్లారావు సమాధానం చెప్పినా తిరిగి అవే తప్పుడు ఆరోపణలను ఆయన చేస్తున్నారని, పుల్లారావు సవాలును జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వైకాపా సభ్యులు 'ఓటుకు నోటు... ఓటుకు నోటు' అంటూ నినాదాలు చేశారు.