: యోగి ఆదిత్యనాథ్ తో చర్చలు జరిపిన ములాయం చిన్న కుమారుడు, కోడలు


ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. సమాజ్ వాదీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్, ఆయన సతీమణి, లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసి రీటా బహుగుణ చేతిలో ఓటమి పాలైన అపర్ణా యాదవ్ లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయి చర్చలు జరిపారు. వీవీఐపీ గెస్ట్ హౌస్ లో బసచేసిన ఆదిత్యనాథ్ ను కలిసిన వీరు ఏం మాట్లాడారన్నది మాత్రం తెలియరాలేదు. ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ములాయం, అఖిలేష్ లు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతీక్, అపర్ణలు కూడా ఆయన్ను కలిసి రావడంపై కొత్త చర్చ సాగుతోంది.

  • Loading...

More Telugu News