: ట్రక్కు డ్రైవర్ అవతారమెత్తిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారమెత్తారు. ఆ వాహనంలో డ్రైవర్ సీట్లో కూర్చుని హారన్ మోగించిన ఆయన, స్టీరింగ్ పట్టుకుని తనదైన శైలిలో హావభావాలు పలికించిన ఈ సంఘటన వైట్ హౌస్ ముందే జరిగింది. ట్రక్కు డ్రైవర్లు, సంబంధిత ప్రతినిధులతో ట్రంప్ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ముందు పార్క్ చేసిన ట్రక్కు డ్రైవర్ సీట్లో ట్రంప్ ఎక్కి కూర్చుని కొంచెం సేపు సందడి చేశారు.